తెలంగాణ కాంగ్రెస్ కి మళ్ళీ షాక్! మరో ఎమ్మెల్యే జంప్!

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ జోరు చూపిస్తుంది.

ఓ వైపు జిల్లా పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ మొత్తం 16 పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకోవాలనే టార్గెట్ తో వున్నాడు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రయోగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలని తన వైపు లాగేసుకుంటుంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే గిరిజన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు.

ఇదిలా వుంటే తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.

అందుకు గాను ఇప్పటికే మంత్రి జగదీశ్వరరెడ్డితో అతను చర్చించడం జరిగింది అని సమాచారం.

ఇతను కోమటిరెడ్డి బ్రదర్స్ కి ప్రధాన అనుచరుడుగా వుండి, వారి అండతోనే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే టికెట్ సొంతం చేసుకున్నాడు.

అలాంటిది ఇప్పుడు వారికే షాక్ ఇచ్చిన చిరుమర్తి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు.