కుల వృత్తులు చేతివృత్తులకు జీవం పోసేందుకే బీసీలకు లక్ష సాయం
TeluguStop.com
47 మంది లబ్దిదారులకు బీసీ బంధు చెక్కుల పంపిణీ.ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బ్రతకాలానేదే సీఎం ఆకాంక్ష.
బీసీ బందు పథకం నిరంతర ప్రక్రియ.దశల వారిగా ప్రతి లబ్దిదారులకు సాయం అందజేత.
కళ్యాణలక్ష్మీ పథకం లాగా బీసి బంధు నిరంతరం కొనసాగుతుంది.కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్( MLA Sunke Ravi Shankar ).రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బీసి కుల వృత్తుల 47 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల బీసీ బంధు సహాయ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి లబ్ధిదారులకు పంపిణి చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండి నియోజక వర్గంలో వెనుకబడిన తరగతుల సోదరుల నడుమ కార్యక్రమాన్ని జరుపుకోవడాన్ని గోప్ప అవకాశంగా బావిస్తున్నానన్నారు.
బీసి కులాల్లో అర్థిక ఎదుగుదలకు తాతముత్తాతలు ఎక్కడా ఆస్థులను ఇచ్చిన దాఖలాలు లేకపోగ,కేవలం వారి కృలవృత్తులను మాత్రమే ఆస్థులుగా వారి వారుసులకు ఇచ్చారని అన్నారు.
నాటి నుండి నేటి వరకు కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి సరైన ప్రోత్సాహం లేక రానురాను కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య ఓ వైపు తగ్గిపోతుంటే, బ్రతుకుదెరువు కొరకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారు వారి కులవృత్తులను కాకుండా కార్పోరేట్ మెరుగులతో మరో వృత్తిని చేస్తుండడంతో అసలైన కులవృత్తిదారులు కనుమరుగవుతున్నారని అన్నారు.
బీసి కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో బ్రతకాలనే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని కోకాపేట్ లో విలువైన భూములను ఇచ్చారన్నారు.
గతంలో బీసి కులవృత్తులను ఆదుకున్న పరీస్థితులు లేవని, బీసి లెవరు అప్పులతో వారి జీవనాన్ని కొనసాగించకూడదని, గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో దళితబందు,బీసిలకు సాయం వంటి బృహత్తర కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు.
బీసి కులాలను ఆదుకోవాలని, కులవృత్తులు పునరుజ్జీవం పోసుకోవాలే, లేబర్ ఓనర్ కావాలనే దిశగా తీసుకువచ్చిన బీసి కులవృత్తులకు లక్ష ఆర్థిక సహయ పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ది దారునికి విడతల వారిగా, దశల వారిగా సహాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.
కళ్యాణ లక్ష్మీ పథకంలా ఈ పథకం కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు.
బెంజ్ కారులో తిరిగే వారికి కాదు,నిజమైన లబ్దిదారునికి పథకం చేరాలనే దిశగా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని, అందులో భాగంగా కులవృత్తుల వారిగా మొదటి విడతలో 300 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
ఈ లక్ష రూపాయలతో మీ చేతి కులవృత్తులు అభివృద్ది చేంది, కుటుంబాల జీవన ప్రమాణాలు పురోగతిని సాధించాలి కాని, అప్పులు కట్టుకోవడానికో, ఆస్థులను కొనుక్కోవడానికో వినియోగించరాదని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చొప్పదండి అభ్యర్థిగా సుంకె రవిశంకర్ కి రెండోసారి అవకాశం కల్పించడం పట్ల మండల బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమం అనంతరం మహిళ ప్రజా ప్రతినిదులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలుఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జూ, ఎంపీడీవో రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి డైరెక్టర్, కొట్టేపల్లి సుధాకర్, స్థానిక సర్పంచ్ గుంటి లతా శ్రీ శంకర్, ఎంపిటిసి సంబ బుచ్చమ్మ లక్ష్మీ రాజం, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?