సూర్యాపేట జిల్లా:పాఠాలు చెప్పే బడిపంతుళ్లు భూమి విషయంలో గొడవపడి బజారున పడ్డ ఘటన జిల్లా కేంద్రంలో కుడకుడ శివారులో వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుడకుడ శివారులో( Kudakuda ) 309 సర్వే నెంబర్ లో 8 మంది కలిసి 2 ఎకరాల 6 గుంటల భూమి కొనుగోలు చేశారు.
అందులో నట్టే సృజన్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చెందిన 20 గుంటల పక్కనే సూర్యాపేటకు చెందిన వల్లెం శంకర్ ప్రసాద్ అనే మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కొంత భూమి ఉంది.
వీరిద్దరి భూమి పక్కన ఉన్న మరో వ్యక్తి,తన భూమిలో హద్దురాలను ఏర్పాటు చేసుకుంటుండగా,సృజన్ కుమార్ తో పాటు వల్లెం శంకర్ ప్రసాద్ కు సమాచారం ఇచ్చారు.
హద్దురాలను సరిచేస్తున్న క్రమంలో సృజన్ పై,శంకర్ ప్రసాద్,తన అనుచరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి, పాల సైదులుతో కలిసి బండరాయితో దాడి చేశాడు.
అనంతరం గాయాలైన సృజన్ తన భార్య జ్యోతి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు)కి సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి వచ్చిన జ్యోతిపై కూడా భౌతికంగా దాడి చేశారు.
దీనితో భార్య భర్తలు వెంటనే చివ్వెంల పోలీసులను ఆశ్రయించగా నట్టే సృజన్ కుమార్ ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ఐ (టు) పసుపులేటి మధు నాయుడు( Madhu Naidu ) కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే దాడి చేసిన ఉపాధ్యాయుడిని కాపాడేందుకు ఉపాధ్యాయ సంఘ నాయకులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లకు తెరలేపడం గమనార్హం.
ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..