ఇంటి వద్దే ఉంటే ఒక కోడి.. 10 కోడి గుడ్లు ఫ్రీ.. ఫ్రీ!

నిజంగా అండి.మన జనాలు ఎంత దారుణంగా తయారు అయ్యారు అంటే మీ ప్రాణాలు పోతాయ్ అయ్యా.

ఇంట్లో ఉండండి అయ్యా అన్న కూడా ఎవరు వినరు.కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా అలాంటి కరోనా వైరస్ ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా అలాంటి కరోనా వైరస్ కు కూడా భయపడటం లేదు మన ప్రజలు.

దీంతో ఎంతోమంది లాక్ డౌన్ ని అతిక్రమించి బయటకు వస్తున్నారు.ఇంకా అలా బయటకు వచ్చే వారిని.

బాధ్యత లేని వారిని ఇంట్లోనే ఉంచాలి అని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుంతపల్లికి చెందిన అనంత రెడ్డి అనే యువకుడు ఓ విన్నూత ప్రయత్నం చేశాడు.

అది ఏంటి అంటే? లాక్ డౌన్ వేళ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇంటి పట్టునే ఉండే కుటుంబాలకు ఒక కోడి, పది కోడి గుడ్లు ఉచితంగా పంపిణి చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఊళ్లో వాళ్లంతా స్థానికంగా ఉండాలి అని ఇతర గ్రామాలకు వెళ్లకూడదని తానూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు అతడు మీడియాకు వివరించాడు.

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బుల్లితెరపై ప్రభాస్ పరువు పాయే.. సలార్ మూవీ టీఆర్పీ రేటింగ్ ఇంత ఘోరమా?