ఈ ఒక్క హెయిర్ ప్యాక్ ఎన్ని సమస్యలను నివారిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పెరిగిన కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, హార్మోన్ చేంజెస్, రసాయనాలు ఎక్కువ‌గా ఉండే షాంపూను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వాడ‌టం తదితర కారణాల వల్ల ఎన్నెన్నో జుట్టు సమస్యలు( Hair Problems ) ఇబ్బంది పెడుతుంటాయి.

జుట్టు విపరీతంగా రాలడం, చిట్లడం, విరగడమే కాకుండా కురులు పొడిగా మారడం, చుండ్రు, బట్టత‌ల ఇలా ఎన్నో సమస్యలు మదన పెడుతూ ఉంటాయి.

అయితే వీటన్నిటికీ ఒక్క హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా.

? అవును, మీరు విన్నది నిజమే.మ‌రి లేటెందుకు ఆ హెయిర్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flaxseed ), రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ప‌ది నిమిషాల పాటు హీట్ చేయాలి.

జెల్లీ స్ట్రక్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు శీకాకాయి పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / చివరిగా అవిసె గింజల జెల్ ను కూడా వేసి అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ష‌వ‌ర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

"""/" / వారంలో కేవలం ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారతాయి.

జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.

చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.

చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.జుట్టు స్మూత్ గా షైనీ గా మారుతుంది.

హెయిర్ బ్రేకేజ్ కంట్రోల్ అవుతుంది.తలలో దురద వేధించకుండా ఉంటుంది.

స్కాల్ప్ ఆరోగ్యంగా శుభ్రంగా మారుతుంది.కాబట్టి ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా సరే తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను ప్రయత్నించండి.

నిజ్జర్ హత్య : ఆధారాలపై చేతులెత్తేసిన ట్రూడో .. భారత్‌దే విజయమన్న కెనడియన్ జర్నలిస్ట్