కరోనా ఎఫెక్ట్ : రూపాయికే చికెన్ బిర్యాని.... ఎక్కడో తెలుసా....

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించి ఎడతెరిపిలేకుండా మాట్లాడుకుంటున్నారు.అయితే అందుకు గల కారణాలు లేకపోలేదు.

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ సోకి కొంత మంది మరణించారు.

మరికొంతమంది ఈ కరోనా వైరస్ లక్షణాలు సోకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వైద్య పరిరక్షణలో ఉన్నారు.

చైనా దేశం నుంచి భారతదేశానికి సోకిన కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని పలు రంగాల ఆర్థిక వ్యవస్థ పై పడింది.

ఈ కరోనా వైరస్ ప్రభావం పడినటువంటి రంగాల్లో పౌల్ట్రీ ఫారం రంగం ఒకటి.

ఇప్పటికే ఈ పౌల్ట్రీ ఫారం రంగం  దాదాపుగా 6 వేల కోట్ల రూపాయలు పైచిలుకు నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల కాలంలో ఈ కరోనా వైరస్ వల్ల కొంత మంది చికెన్ షాపు యజమానులు రేట్లను భారీగా తగ్గించేశారు.

అంతేగాకకొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ రాదని అవగాహన కల్పించేందుకు ఉచితంగా కూడా కోళ్ళని సరఫరా చేశారు.

అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తిరువల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి కొత్తగా కొత్తగా హోటల్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.

దీంతో తన కస్టమర్లకి రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నాము అంటూ ప్రకటన చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న టువంటి స్థానికులు కరోనా వైరస్ భయాన్ని పక్కనపెట్టి ఒక్కొక్కరు రెండు మూడు బిర్యానీ పొట్లాలను తీసుకెళ్లారు.

"""/"/ దీంతో హోటల్ యజమాని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.కరోనా వైరస్ కారణంగా తాము వండిన చికెన్ బిర్యాని అమ్ముడు పోతుందో లేదని మొదట్లో భయపడ్డామని కానీ ప్రజల నుండి ఇంత మంచి స్పందన రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అంటున్నాడు.

అయితే ఈ చికెన్ బిర్యానీ విక్రయాలు మొదలుపెట్టిన రెండు గంటలలోపు దాదాపుగా 120 కేజీల చికెన్ బిర్యాని ఖాళీ అయిందని హోటల్ యజమాని తెలిపాడు.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ను సినిమాలను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా..?