ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క.. అంటున్న దుర్గారావు..!

టిక్ టాక్ ద్వారా కొందరు తెలుగు వ్యక్తులు బాగా సుపరిచితులు అయ్యారు.ఇందులో భాగంగానే లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ స్టార్ అయిన దుర్గారావు మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

తన భార్యతో కలిసి వెరైటీ డ్యాన్సులు చేస్తూ పాపులర్ గా మారిపోయాడు.ముఖ్యంగా న‌క్కిలీసు గొలుపు పాట‌కు భార్యాభర్తలిద్దరూ చేసిన డ్యాన్స్ తెలుగు ప్రజలలో బాగా పాపులర్ అయ్యాయి.

అలాగే వీరి స్టెప్పులను కూడా ప్రముఖ డాన్సర్ పండు కూడా ఓ డాన్స్ షోలో కూడా వీరిని అనుసరిస్తూ డాన్స్ చేయడంతో వీరి పాపులారిటీ మరింత పెరిగిపోయింది.

దీంతో దుర్గారావు స్టార్ కాస్త మారిందని చెప్పవచ్చు.తన పాపులారిటీని రోజురోజుకు పెంచుకుంటూ అనేక షోలలో తన ఎంట్రీ ఇస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు.

ఇప్పటికే తెలుగు బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలలో దుర్గారావు మెరిశాడు.దుర్గా రావు దంపతులు టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్ లో ఛానల్ ఏర్పాటు చేసి అందులో కూడా ఎన్నో రకాల పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలను అప్లోడ్ చేస్తూ బాగా సంపాదించారు.

ఇక ఈ ఇద్దరి దంపతులకు పలువురు బుల్లితెర ప్రముఖులు అలాగే కొందరు నటీనటులు కూడా సహాయం అందించడంతో వీరి ఇంపార్టెన్స్ సోషల్ మీడియాలో మరింతగా పెరిగింది.

ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన రవితేజ సినిమా ట్రాక్ సినిమాలోనూ దుర్గారావు మెరిశాడు.

ఇక అసలు విషయంలోకి వెళితే. """/"/ ఈ టీవీ ఛానల్ లో జరిగే రియాలిటీ డాన్స్ షో ఇప్పుడు 13 సీజన్ జరుగుతుండగా.

తాజాగా విడుదలైన ప్రోమోలో దుర్గారావు రెచ్చిపోయాడు.రాబోయే శర్వానంద్ సినిమా శ్రీకారం లోని వ‌స్తానంటివో పోతానంటివో అనే పాటకు డాన్స్ చేసి మెప్పించాడు.

మాస్ స్టెప్పులతో ఆలరించిన దుర్గారావు ఆ పాట మధ్యలో "ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క" అంటూ ఇది కాదు ఇది వేయి అంటూ తనదైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించాడు.

తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూస్తే తెలుగు ప్రేక్షకులను మరోసారి తనదైన శైలిలో అలరించబోతునట్లు ఇట్టే అర్థమవుతుంది.

దుర్గారావు వేసిన స్టెప్పులు చూడాలంటే ఈ వారం ప్రసారమయ్యే డీ షో లో చూడాల్సిందే.

అలాంటి వ్యక్తి భర్తగా రావాలి.. దేవర బ్యూటీ కామెంట్స్ వైరల్!