మరోసారి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోయెడ వద్ద ఈ ఘటన జరిగింది.అయితే తమ ప్రచార రథంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరి అమ్మాయిలను సముద్రంలోకి లాగేసిన అలలు.. తర్వాత ఏమైందో చూడండి..