తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం
TeluguStop.com
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం చెలరేగింది.ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను అంటించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది.ఈ నేపథ్యంలో వైసీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నాయి.
అయితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర ఎందుకు ఆలస్యం అయిందంటూ కరపత్రాలలో ప్రశ్నించారు.అదేవిధంగా నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పుకునేందుకు ఏమీ లేదంటూ వెలసిన కరపత్రాలు స్థానికంగా కలకలంగా మారాయి.