మరోమారు ప్రతిభ చాటిన మాస్టర్ ప్రజ్ఞానందా... ఏకంగా ప్రపంచ నెంబర్ 1ను ఓడించాడు!

16 ఏళ్ల ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి 'ప్రజ్ఞానందా రమేష్‌బాబు' మరోసారి చరిత్ర లిఖించాడు.

నిన్న శుక్రవారం అనగా మే 20,22న జరిగిన ఆన్ లైన్ చెస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ వన్, నార్వే ఆటగాడు అయినటువంటి 'మాగ్నస్ కార్ల్‌సన్‌'పై విజయం సాధించాడు.

కాగా ఇతగాడి వయస్సు 31 ఏళ్ళు.చెస్‌బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ యొక్క 5వ రౌండ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగారు.

మాగ్నస్ కార్ల్‌సన్‌ 40వ ఎత్తులో వేసిన పొరబాటును ప్రజ్ఞానంద క్యాష్ చేసుకుని, విజయం సాధించాడు.

దీంతో నాకౌట్ దశకు వెళ్లే అవకాశాలను ప్రజ్ఞానంద సజీవంగా ఉంచుకున్నాడు.ఇకపోతే, ఈ మ్యాచ్ జరిగిన సందర్భంలో చూసినవారు 5వ రౌండ్ లో ఒకానొక దశలో మాగ్నస్ ఆట డ్రాగా ముగుస్తుందని అనుకున్నారు.

అయితే 40వ ఎత్తులో అతగాడు చేసిన ఓ బ్లండర్ మిస్టేక్ వలన చివరకు ఆటను అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది.

మాగ్నస్ తన 40వ ఎత్తులో తప్పుగా గుర్రాన్ని జరిపిన అనంతరం, ప్రజ్ఞానంద అదే అదనుగా ఆ అవకాశాన్ని వేడుకొన్నాడు.

దీంతో విజయం సాధించాడు.కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ‘ఎయిర్ థింగ్స్ మాస్టర్స్’ ఆన్ లైన్ మ్యాచ్ లో, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా మొదటిసారి మాగ్నస్ కార్ల్‌సన్‌ పై విజయం సాధించాడు.

ఇక తన తాజా విజయంపై ప్రజ్ఞానంద మాట్లాడుతూ."హమ్మయ్య! ఇక ఇప్పుడు మంచం ఎక్కి ప్రశాంతంగా నిద్ర పోవాలి!" అని అన్నాడు.

ఇకపోతే, ఆట మధ్యలో 3 పాయింట్లు కోల్పోయిన ప్రజ్ఞానంద, ఒకానొక దశలో ఒకింత అసహనానికి లోనయ్యాడు.

ఇక ప్రపంచ నెంబర్ వన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్‌ పై 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా విజయం సాధించడంపై ఓ అద్భుతమనే చెప్పుకోవాలి.

ఈ సందర్భంగా భారతీయులు సోషల్ మీడియాలో ప్రజ్ఞానంద విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మనోడికి ప్రపంచ ఛాంపియన్ పై గెలవడం ఇతనికి బాగా అలవాటైంది అని ఒకరు, మరోసారి ‘ఏసేశాడు” అంటూ మరొక నెటిజన్ కామెంట్స్ చేసారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, గురువారం 2024