కేంద్రం తీరుపై మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు.నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు.

మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక వ్యక్తికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు.

ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదన్న ఆయన మరొక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇస్తే జిల్లా బాగుపడదని చెప్పారు.

రాజకీయ ప్రయోజనం కాదు .నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోదీ గారు అంటూ ట్వీట్ చేశారు.

గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ.80 వేల కోట్ల ప్యాకేజీలు ఇచ్చినట్లే.

తెలంగాణ రాష్ట్రానికి కనీసం రూ.18 వేల కోట్లు ఇవ్వలేరా అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రవాసీ భారతీయ దివస్ .. ఎన్ఆర్ఐలకు అడ్వైజరీ జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం