రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో మూవీ వచ్చే ఛాన్స్.. ఆ విమర్శలకు చెక్!
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) పేరు కూడా ఒకటి.
ఇటీవల రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు ముందు నుంచి రవితేజ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
ఇక ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని రవితేజ అభిమానులు కూడా భావించారు.
కానీ అభిమానులకు ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
"""/" /
కాగా ఈ సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
దీంతో రవితేజ అభిమానులు అటు హీరో ఫై ఇటు దర్శకుడు పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ముఖ్యంగా రవితేజ పై కొంతమంది ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో రవితేజ నుంచి సరైన సక్సెస్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.
దీంతో రవితేజ అభిమానులు రవితేజ విషయంలో కాస్త గుర్రుగా ఉన్నారు.ఆ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పలు క్రేజీ కాంబినేషన్ లలో రవితేజ హరీష్ శంకర్ ల కాంబినేషన్ కూడా ఒకటి.
అయినా కూడా ఈ సారి సినిమాకి మాత్రం విడుదల తర్వాత ఎందుకో బాగా నెగిటివ్ వచ్చింది.
"""/" /
అయినప్పటికీ హరీష్ తమ కాంబినేషన్ నుంచి మరో సినిమా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాడు.
దీనితో మళ్లీ ఈ అంశంపై నెటీజన్స్ లో భిన్నా భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఒకవేళ వీరి నుంచి నెక్స్ట్ సినిమా పడితే రీమేక్ కాకుండా మిరపకాయ్( Mirapakay ) లాంటి స్ట్రెయిట్ సినిమా పడితే ఏమన్నా మళ్ళీ ఆడియెన్స్ నుంచి మంచి అటెన్షన్ వస్తుందేమో చూడాలి మరి.
కొందరు ఈసారైనా సినిమా సక్సెస్ అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తుండగా, ఇంకొందరు ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ హైప్ సరిపోదు డాకు మహారాజ్.. బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారా?