మరోసారి పవన్ వారాహి యాత్ర .. ఎప్పుడు ఎక్కడ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వారాహ యాత్ర( Varahi Yathra )ను ప్రారంభించనున్నారు.

ఇటీవలే L తీవ్ర జ్వరానికి గురికావడంతో పిఠాపురం నియోజకవర్గంలో  తాత్కాలికంగా నిలిపివేసిన ప్రచారాన్ని రేపు ఆదివారం నుంచి పవన్ ప్రారంభించనున్నారు .

అనకాపల్లిలో 7న  సభను నిర్వహించనున్నారు.  8న యలమంచిలి,  9న పిఠాపురంలో సభను ఏర్పాటు చేస్తున్నారు.

ఆ తరువాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న అనకాపల్లి,  యలమంచిలి , నెలిమర్ల నియోజకవర్గల్లో వారాహి  ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

టిడిపి ,జనసేన ,బిజెపి కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని , కచ్చితంగా ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పవన్( Pawan Kalyan ) ఉన్నారు.

"""/" / ముఖ్యంగా ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా పవన్ ముందడుగు వేస్తున్నారు.

దీనిలో భాగంగానే రాష్ట్ర మంత్రుల విస్తృతంగా వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి,  కూటమి అభ్యర్థులు గెలిచేలా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పవన్ ఆ తర్వాత తెనాలిలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది .

ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత తెనాలి సభలో ప్రసంగించబోతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మూడు పార్టీల అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

"""/" /  ఇటీవల పిలోఠాపురం( Pithapuram ) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు.

దీనికి ప్రజల నుంచి భారీగా స్పందన రావడంతో , అవకాశం ఉన్న చోట్ల ఇదే విధంగా రోడ్డు షోలు నిర్వహించి జన సైనికుల్లోనూ ఉత్సాహం పెంపొందించేలా చేసి ,అది తమకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.

ఇది ఎలా ఉంటే జనసేన, బీజేపీ, టిడిపి పార్లమెంట్ స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహాల పైన చర్చించి కూటమి కార్యాచరణను రూపొందించుకోనున్నారు.

ఎన్నికల తరువాత ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్,  కొత్త ఓటర్లు,  ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు, పోస్టల్ ఓట్లు,  బూత్ ఏజెంట్లు తదితర అన్ని అంశాల పైన మూడు పార్టీలు ఒక అవగాహనకు రానున్నాయి.

లైంగిక వేధింపుల కేసు .. కెనడాలో భారతీయ విద్యార్ధి అరెస్ట్ , ఒంటరి మహిళలే టార్గెట్