మరోసారి పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!

మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ( Janasena Party ) విస్తృతస్థాయి సమావేశంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా పొత్తుల అంశాన్ని గురించి మరోసారి ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

ఎటువంటి గొడవలకు పోకుండా వ్యక్తిగతంగా తీసుకోకుండా.కలిసి పని చేయాలని సూచించారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులను వివరించడానికి త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశం అమిత్ షా, జేపీ నడ్డా( Amit Shah, JP Nadda ) దృష్టికి తీసుకెళ్లి వివరిస్తా.

ఎందుకు పొత్తు ప్రకటించాల్సిన అవసరం వచ్చిందో తెలియజేస్తా.రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను వారి దృష్టికి తీసుకెళ్తా.

ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి.పొత్తు అంశాన్ని వారికి వివరించాల్సి ఉంది అని స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బలమైన స్థానాలలో జనసేన అసెంబ్లీలో( Janasena Assembly ) అడుగుపెడుతుందని పేర్కొన్నారు.

ఆరోజు ఏపీ దిశ దశ మార్చేస్తాం.పార్లమెంటులో కూడా జనసేన అడుగు పెట్టాలి.

ఎన్ని స్థానాలు.? ఎక్కడి నుంచి పోటీ.

? అనే వ్యూహం నాకు వదిలేయండి.అధికారం ఎలా పంచుకుందాం.

? ముఖ్యమంత్రి స్థానం అనేవి సమయం వచ్చాక మాట్లాడుదాం.ముందు వైసీపీ ఓడిపోవాలి.

జగన్ ను ఏపీ నుంచి తరిమేయాలి అని పవన్ వ్యాఖ్యానించారు.

SSMB 29 నో వాటర్ బాటిల్… కొత్త రూల్ అమలు చేయబోతున్న జక్కన్న!