నానికి కలిసిరాని ఓటీటీ రిలీజ్..!

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా టక్ జగదీష్.

షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

సినిమాను థియేటర్ రిలీజ్ ఎనౌన్స్ చేసి నిర్మాతల ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేశారు.

సెప్టెంబర్ 10 రిలీజ్ ఎనౌన్స్ చేయగా సెప్టెంబర్ 9 రాత్రి 8:30 కే ప్రైం వీడియోలో టక్ జగదీష్ రిలీజైంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమా ఆశించిన స్థాయిలో లేదన్నది సినిమా చూసిన ఆడియెన్స్ అంటున్నారు.

రెగ్యులర్ కథనే.అదే తరహా రెగ్యులర్ ట్రీట్ మెంట్ తో డైరక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించాడని చెప్పుకుంటున్నారు.

సినిమా మొత్తం మీద రెండు మూడు సీన్స్ తప్ప మిగతా అంతా రొటీన్ గా నడుస్తుందని అంటున్నారు.

నాని తన వరకు నటన బాగానే చేసినా ఎందుకో మ్యాజిక్ జరగలేదని టాక్.

వి సినిమా ఓటీటీ రిలీజై నిరాశపరచగా నాని టక్ జగదీష్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందని అనుకోగా ఈ సినిమా కూడా నానికి వి రిజల్ట్ నే తెచ్చేలా ఉందని అంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో నిరసన జ్వాలలు..!!