మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎంని కలిసి తమ ఇబ్బందులు వివరించిన మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి, వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్‌వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలుముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఒక్కొక్కరికి రూ.

2 లక్షల చొప్పున ముగ్గురు దివ్యాంగులకు చెక్కులు అందజేసిన బాపట్ల జిల్లా కలెక్టర్‌ కే.

విజయకృష్ణన్‌గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు, కుమార్తె పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని, ఆరు ఎకరాల భూమిని సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్ళారు.

అయితే ఐదు ఎకరాలకు మించి భూమి ఉంటే ఫించన్‌ రాదనే నిబంధన ఉండడంతో వారికి ఆ విషయం తెలిపిన సీఎం, ఆ కుటుంబానికి తక్షణమే ఆర్ధిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్‌ భవనం నిర్మిస్తూ ప్రమాదవశాత్తూ మూడంతస్తుల నుండి కిందపడి దివ్యాంగుడినై, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నట్లు సీఎంకి వివరించారు.

స్పందించిన ముఖ్యమంత్రి విద్యాసాగర్‌ కుటుంబానికి కూడా తక్షణమే ఆర్ధిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ముగ్గురు దివ్యాంగులకు చెక్కులు అందజేసిన బాపట్ల జిల్లా కలెక్టర్‌ కే.

విజయకృష్ణన్‌.సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి గారు స్పందించడం, వెంటనే తమకు సాయం చేయడం ఎన్నడూ మరువలేమని వారు తమ ఆనందాన్ని జిల్లా కలెక్టర్‌తో పంచుకున్నారు.

సూసేకి పాటకు వధువు క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్..