మరోసారి అమరావతి రైతుల భారీ పాదయాత్ర
TeluguStop.com
రాజధాని అమరావతి రైతులు మరోసారి భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.గతేడాది తుళ్లూరు నుంచి తిరుపతికి చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన రావడంతో ఇప్పుడు మరోసారి మహా పాదయాత్రకు రైతులు సిద్ధమయ్యారు.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుకు కట్టుబడి, నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు.
అమరావతిలో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 60 రోజులకుపైగా కొనసాగి అరసవిల్లిలో ముగియనుంది.ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం కాగా, వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.
చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?