ప్రపంచంలోనే అత్యధికంగా సబ్స్క్రైబర్లు కలిగిన యూట్యూబ్ ఛానళ్ళపై ఓ లుక్కేయండి!

స్మార్ట్ ఫోన్ యాప్స్ లో అత్యంత పాపులర్ అయినటువంటి యూట్యూబ్ అంటే ఏమిటో తెలియని జనాలు ఉండనే వుండరు.

నేది అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాకుండా ఆదాయ వస్తువుగా మారింది.

అనేకమంది దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఏ ముహూర్తాన దీనిని కనిపెట్టారో కానీ నాటినుండి నేటివరకు అప్రతి హతంగా దూసుకుపోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఇందులో వ్యక్తిగత ఛానల్ ని కలిగి వున్నారు.

ప్రస్తుతం ఈ ఛానళ్ళ ద్వారా కొన్ని లక్షలమంది లక్షల్లో సంపాదిస్తున్నారంటే మీకు నమ్మశక్యం కాదేమో.

భారతదేశంలో ప్రతి 5 వేల మందిలో ఇద్దరికీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని ఒక సర్వే వుంది.

ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది.ఆదాయం భారీగా ఉండడంతో చాలా మంది యూట్యూబ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

వారివారి ప్రతిభను ప్రదర్శించి దండిగా ఆదాయాన్ని పొందుతున్నారు.భారత్ లాంటి దేశాల GDPకి యూట్యూబ్ ఏటా 6,800 కోట్లు ఇస్తోంది అంటే మీరు నమ్ముతారా.

"""/"/ ఆదాయం అనేది సబ్స్క్రైబర్ల ఆధారంగా, వ్యూస్ ఆధారంగా నిర్దేశించబడి ఉంటుంది.ఈ జాబితాలో అన్నింటి కంటే ముందు వరుసలో ఉండేది T సిరీస్.

అవును, ఈ ఛానల్ కి 230 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.దాని తరువాత 'కూ మీలన్ నర్సరీ రైమ్స్' అనే ఛానల్ 148 మిలియన్ల సబ్స్క్రైబర్లు కలిగి వుంది.

అలాగే 'సెట్ ఇండియా' అనే ఛానల్ కు 147 మిలియన్లు, 'మిస్టర్ బీస్ట్' అనే ఛానల్ కి 114 మిలియన్లు, 'ప్యూ డయి పయి' అనే ఛానల్ కి 111 మిలియన్లు 'కిడ్స్ డయానా షో' అనే చానెల్ కు 104 మిలియన్లు, 'లైక్ నాస్తయా' అనే ఛానల్ కు 102 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??