ఏ వారం నాడు తనకు నూనె రాసుకుంటే మంచిది?
TeluguStop.com
హిందూ సంప్రదాయాల ప్రకారం తల స్నానం చేయడం, నూనె రాసుకోవడం వంటివి ఈ ఈ రోజుల్లో మాత్రమే చేయాలనే నియమాలు ఉన్నాయి.
కానీ వాటిని మనం అంతగా పట్టించుకోము.మనకు నచ్చిన, వీలున్న రోజున మాత్రమే తల స్నానం చేయడం, తలకు నూనె రాసుకోవడం వంటివి చేస్తుంటాం.
కానీ అలా చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవతాయని పండితులు చెబుతున్నారు.మరి వారంలో ఏ రోజు నూనె అంటుకుంటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం తలకు నూనె రాసుకోవం వల్ల దుఃఖం కల్గుతుందట.సోమవారం రోజు అంటుకుంటే శుభం కల్గుతుంది.
అలాగే మంగళ వారం మృత్యువు సంభవిస్తుందట బుధవారం తలకు నూనె రాసుకోవడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గురువారం హాని కల్గుతుందట.శుక్ర వారం నూనె అంటుకోవడం వల్ల దుఃఖం కల్గుతుంది.
అలాగే శనివారం నాడు నూనె పెట్టుకోవడం వల్ల సుఖం కల్గుతుంది.అయితే మనకు తెలియకుండా సమస్యలు వచ్చే వారం నాడు నూనె అంటుకే.
ఆ దోషాలు తొలగిపోయేందుకు కొన్ని చేయాల్సి ఉంటుంది.అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.
ఆదివారం రోజు నూనెలో సువాసన గల పూలు కలపడం వల్ల.ఆ రోజు నూనె అంటుకుంటే చాలా మంచి జరుగుతుంది.
అలాగే మంగళ వారం అయితే అందులో కొద్దిగా మట్టిని కలపాలట.గురువారం రోజు అయితే నూనెలో కొన్ని గరిక పోచలు వేయాలి.
శుక్రవారం అయితే నూనెలో ఆ పేడ సూక్ష్మంగా కలపడం వల్ల కీడు తొలగి మంచి జరుగుతుందట.
ప్రియురాలి దారుణ హత్య .. యూకేలో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు