వసంత పంచమి రోజు.. ఇలా చేస్తే జ్ఞానంతో పాటు..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు జనవరి 26 తేదీన వసంత పంచమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు.

వసంత పంచమి పర్వదినం రోజు మనలో విజ్ఞానానికి, కళలకు, జ్ఞానానికి సంబంధించిన దేవత సరస్వతీ దేవికి అంకితం చేయబడి ఉంది.

ముఖ్యంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటారు.

దక్షిణ భారత దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పర్వదినాలలో సరస్వతీ పూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉంటారు.మనం దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించి ఏ విధంగా అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూస్తాము.

అదే విధంగా సరస్వతీ దేవి కోసం వసంత పంచమి రోజు పూజించి ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞాన దీప్తిని వెలిగించాలని దేవిని ప్రార్థించాలి.

సరస్వతి దేవి తెల్లటి వస్త్రాలతో మధ్యాహ్నానికి ముందు అంటే పూర్వాహ్న సమయంలో పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.

"""/"/ తెలుపు రంగు సరస్వతి దేవికి ఇష్టమైన రంగు కావడంతో తెలుపు రంగు బట్టలతో, తెల్లటి పూలతో సరస్వతి దేవిని అలంకరించి పాలు, తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలను సరస్వతీ దేవికి నైవైద్యంగా సమర్పించి అమ్మవారిని పూజించాలి.

వసంత పంచమి రోజున చాలా మంది అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఆ రోజే విద్యకు ఆరంభంగా తమ చిన్నారుల తోటి అక్షరాభ్యాసాన్ని చేయిస్తూ ఉంటారు.

అంతే కాకుండా వసంతి పంచమి రోజు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా చూసుకొని ఇల్లు శుభ్రం చేసుకుని సరస్వతి దేవికి పూజ చేసి ఆ తల్లిని ప్రార్థించుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని వేద పండితులు చెబుతున్నారు.

విద్యార్థులు చదువులో ముందు ఉండాలంటే సరస్వతి దేవి విగ్రహాన్ని స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడం మంచిదని తెలిపారు.

టార్గెట్ జగన్… పులివెందుల నుంచే మొదలుపెట్టిన బాబు