MP Lavu Srikrishna Devarayalu : ఈనెల 22వ తారీకు టీడీపీ లోకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..!!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడేకొలది పరిస్థితులు తారుమారవుతున్నాయి.ఈ క్రమంలో టికెట్స్ రాని నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి విజయవాడ ఎంపీ కేశినేని నాని మరి కొంతమంది నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోవడం జరిగింది.

ఇదే పరిస్థితి అధికార పార్టీలో కూడా నెలకొంది.మొన్ననే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( MP Balashowry ) జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.

కాగా ఇప్పుడు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన కృష్ణదేవరాయలు తెలుగుదేశం నాయకులతో సమావేశాలు అవుతూ ఉన్నారు.

గతవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన సమయంలో ఆయనతో భేటీ అయ్యారు.గురువారం కూడా ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ కావడం జరిగింది.

సుదీర్ఘ చర్చల అనంతరం లావు శ్రీకృష్ణదేవరాయలు( MP Lavu Srikrishna Devarayalu ) తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించారు.

ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే 2024 ఎన్నికలకు సంబంధించి నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) పోటీ చేయబోతున్నారు.

తాజా పరిణామాలతో పల్నాడు రాజకీయం రసవతారంగా మారింది.

ముఖం మొత్తం మచ్చలేనా.. ఖరీదైన క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ మీకోసం!