వెండితెర‌పై.. మ‌రో తెలుగు ముఖ్య‌మంత్రి జీవితం..!

వెండితెర‌పై మ‌రో తెలుగు ముఖ్య‌మంత్రి జీవితం!

ఔను! వెండితెర‌పై మ‌రో దివంగ‌త నాయ‌కుడు, ప్ర‌జ‌ల నేత, ఉమ్మ‌డి ఏపీని ప‌రిపాలించిన ముఖ్య‌మంత్రి జీవితం సినిమాగా రానుం ది.

వెండితెర‌పై మ‌రో తెలుగు ముఖ్య‌మంత్రి జీవితం!

అయితే.దీనివెనుక ఎవ‌రు ఉన్నారు.

వెండితెర‌పై మ‌రో తెలుగు ముఖ్య‌మంత్రి జీవితం!

? ఏంటి?  దీనికి కూడా రాజ‌కీయాలే కార‌ణ‌మా?  ఓటు బ్యాంకు కోస‌మే.ఈ చిత్రాన్ని తీస్తున్నారా? అనే అనేక ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఇప్ప‌టికిప్పుడు స‌మాధానం ల‌భించ‌డం లేదు.

అయితే.ప్ర‌స్తుతం అందిన స‌మాచారం మేర‌కు.

దివంగ‌త ద‌ళిత ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య జీవితాన్ని సినిమాగా తీసుకువ‌చ్చేందుకు తమిళ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌య‌త్నిస్తోంది.

ఉమ్మ‌డి ఏపీలో త‌న‌దైన పాల‌న‌ను అందించారు సంజీవ‌య్య‌.అత్యంత నిరాడంబరుడిగా జీవితాన్ని గ‌డిపారు.

జీవితాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన‌.ఆనాటి నేత‌ల్లో సంజీవ‌య్య కీల‌క నాయ‌కుడు.

వాస్త‌వానికి మ‌న‌కు మాజీ.దివంగ‌త ముఖ్య‌మంత్రుల సినిమాలు.

వారి జీవితాల డాక్యుమెంట‌రీలు కొత్త‌కాదు.గ‌తంలో అంటే.

గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.అన్న‌గారు ఎన్టీఆర్ జీవితాన్ని ఆయ‌న కుమారుడు.

ఎమ్మెల్యే బాల‌య్య రెండు భాగాలుగా తీసుకువ‌చ్చారు.ఇక‌, ఇదే అన్న‌గారి జీవితంలోని మ‌రో కోణాన్ని సంచ‌ల‌న వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించారు.

"""/"/ అయితే.ఈ చిత్రాలు తీసుకురావ‌డం వెనుక రాజ‌కీయ కోణంతోపాటు.

ప్ర‌జ‌ల‌ను భావోద్వేగానికి గురిచేసే పొలిటిక‌ల్ వ్యూహం కూడా ఉంది.ఇక‌, ప్ర‌స్తుత అధికార పార్టీ వైసీపీ కూడా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవితాన్ని వెండితెర‌కు ఎక్కించింది.

ఇది కూడా రాజ‌కీయ కోణంలోనే కావ‌డం గ‌మ‌నార్హం.అధికార పీఠం ద‌క్కించుకోవ‌డమే ల‌క్ష్యంగా నాడు అడుగులు వేశారు.

అయితే.ఇప్పుడు దామోద‌రం సంజీవ‌య్య జీవితాన్ని తెర‌కు ఎక్కించ‌డం వెనుక ద‌ళిత ఓట్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు `ఎవ‌రైనా` సినీ రంగంతో ట‌చ్‌లో ఉన్న రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌య‌త్నిస్తున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.ఇక‌, చెన్నైకి చెందిన తెలుగుసినీ సంస్థ‌ `సాంధ్య‌శ్రీ సినిమా క్రియేష‌న్స్‌` సంస్థ‌.

దామోద‌రం సంజీవ‌య్య జీవితాన్ని తెర‌కెక్కించాల‌ని నిర్ణ‌యించింది.త‌మిళ‌నాడుకు  చెందిన `ద్రావిడ‌దేశం` స్వ‌చ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణారావు.

ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.త్వ‌ర‌లోనే ఈ సినిమా వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

కెనడా ఎన్నికలు.. ముందస్తు పోలింగ్‌పై ప్రజల ఆసక్తి , భారీగా ఓటింగ్