వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటీషన్ పై.. విచారణ వచ్చే నెలకి వాయిదా..!!

కొద్ది రోజుల క్రితం ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఈ మేరకు జనవరి 29వ తారీకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

దీంతో నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఈ క్రమంలో వైసీపీ( Ycp ) పార్టీ నుండి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు.

ఇదే సమయంలో హైకోర్ట్ నీ ఆశ్రయించడం జరిగింది. """/" / తమకు స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్ పై సోమవారం మధ్యాహ్నం న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ దశలో జోక్యం చేసుకోలేము అని స్పష్టం చేసింది.

అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులను ఆదేశించింది.ఈ నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేస్తూనే తదుపరి విచారణను వచ్చే నెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది.

ఆకాశ్ జగన్నాధ్ పరిస్థితి ఏంటి..? తల్వార్ సక్సెస్ అవుతుందా..?