నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ అయిన మొదటి రోజే ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల నుండి 7 నామినేషన్లు దాఖలయ్యాయి.
నల్గొండ పార్లమెంట్ స్థానానికి 4 అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.
చొల్లేటి ప్రభాకర్ (స్వతంత్ర) 2 సెట్లు, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున వారి ప్రతిపాదకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఒక సెట్, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) తరఫున రచ్చ సుభద్రారెడ్డి ఒక సెట్,ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
భువనగిరి లోక్ సభ స్థానం నుండి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్లు, తంస్వత్ర అభ్యర్థులు బేతి నరేందర్,నర్రె స్వామి నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ హనుమంతు కె.
జెండగే తెలిపారు.
కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి మహిళలు..!