ఒకప్పుడు చాలా పొదుపుగా మాట్లాడే మహేష్.ఈమధ్య వరుస సినిమాల విజయంతో గల గలా మాట్లాడేస్తున్నాడు.
మహేష్ ఇంతగా ఓపెన్ అవడం చూసి ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.స్టేజ్ మీద మాత్రమే కాదు ప్రెస్ మీట్, ఇంటర్వ్యూస్ లో మహేష్ కామెంట్స్ స్పెషల్ గా అనిపిస్తున్నాయి.
ఇదే ఎక్కువ అనుకుంటుంటే ఇప్పుడు ఏకంగా మహేష్ సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా వేశాడు.
కర్నూలు లో జరుపుకుంటున్న సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మహేష్ కెరియర్ లో మొదటిసారి స్టేజ్ మీద డ్యాన్స్ వేశారు.
దీనికి కారణం కూడా అప్పుడెప్పుడో ఒక్కడు టైం లో కర్నూలు వచ్చానని.ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వచ్చాను.
తన కోసం ఇంతమంది వస్తారని అనుకోలేదు.అందుకే మీ కోసమే అంటూ అభిమానులను ఉద్దేశించి మీ కోసమే డ్యాన్స్ చేశానని అన్నారు మహేష్.
అంతేకాదు ఈవెంట్ అంటూ చేస్తే రాయలసీమలో చేయాలని అన్నట్టు ఉందని అన్నారు మహేష్.
ఇది సక్సెస్ మీట్ లా లేదని వంద రోజుల ఫంక్షన్ లా ఉందని అన్నారు మహేష్.
బాబు స్టెప్పులేస్తుంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్ లో కేకలు వేశారు.
నాగచైతన్యకు ఆ విధంగా హెల్ప్ చేసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. అసలేమైందంటే?