నవంబర్ 29 సుబ్రహ్మణ్య షష్టి నాడు సంతాన సమస్యలు కుజదోషం ఉన్నవారు ఇలా చేయడం మంచిదా..

శివుని రెండవ కుమారుడైన కుమారస్వామే సుబ్రహ్మణ్యస్వామి అని దాదాపు చాలామందికి తెలుసు.మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య స్వామి షష్టి గా భక్తులు జరుపుకుంటారు.

దీన్నే చంప షష్టి, ప్రవర షష్టి, సుబ్బరాయుడు షష్టి అని చాలా రకాల పేర్లతో పిలుస్తారు.

కుమారస్వామి మాతృ గర్భం నుంచి పుట్టిన వాడు కాదు అని చాలామంది భక్తులకు తెలుసు.

ఈ సృష్టిని పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి నుండి రక్షించడానికి దేవతలంతా బ్రహ్మ దేవుని కోరారు.

ఆ రాక్షసుడు ఈశ్వర సంభుతుడి వల్లనే మరణం చెందే అవకాశం ఉంది అని చెప్పాడు.

శివుడి నుంచి వచ్చి ఆ తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు.దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగా నదిలో విడిచిపెడతాడు.

ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికల దేవతల గర్భంలోకి ఆ శక్తి ప్రవేశించింది.

వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు.ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవిస్తాడు.

ఆ విషయాన్ని తెలుసుకున్న శివపరమేశ్వరుడు రుద్రాక్ష సంభూతుడిగా కైలాసం తీసుకువెళ్తారు.ఆ బాలుడు గంగ గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గంగేయుడని, ఆరు ముఖాల కలవాడైనందున షణ్ముఖుడని, కార్తీక్ దేవుడని పుత్రుడు రావడం వల్ల కుమారస్వామి అని కూడా పిలుస్తారు.

కారణజన్ముడైన ఈ బాలుడిని శివపార్వతులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకారుసుర సంహారం చేయమని చెబుతారు.

"""/"/ సుబ్రహ్మణ్య స్వామి ఆరోజు పూజ చేయడం వల్ల చాలా రకాల సమస్యలు దూరమవుతాయని వేద పండితులు చెబుతున్నారు.

నవంబర్ 29 వ రోజున భక్తులు సూర్యోదయానికి ముందు స్నానం చేసి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని పాలు, పండ్లు, పూలు, వెండి పడగలు వెంటికల్లు మొక్కుబడల ఆధారంగా సమర్పిస్తూ ఉంటారు.

జాతకంలో కుజదోషం కాలసర్ప దోషం, సకాలంలో వివాహం కాని వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరోజు జరిగే కళ్యాణం చేయించిన, చూసిన శుభం జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

ఇదేందయ్యా ఇది.. తీసేకొద్దీ బంగారం, డబ్బులు (వీడియో)