మార్చి 29న దుర్గాష్టమి రోజు గులాబీ రంగు దుస్తులతో.. దుర్గమ్మ పూజ చేసిన తర్వాత..?

చైత్ర మాసంలో వచ్చే వసంత నవ రాత్రులు త్వరలో ముగియనున్నాయి.నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించడం మన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది.

తొమ్మిది రూపాలలో దుర్గా మాతను( Durgamatha ) పూజిస్తూ ఉంటారు.ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు మార్చి 22న మొదలై, మార్చి 30వ తేదీన ముగుస్తాయి.

ఇందులో దుర్గాష్టమిని మార్చి 29వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.అష్టమి తిధి మార్చి 28 రాత్రి 07.

04 నిమిషాలకు ప్రారంభమై, మార్చి 29 రాత్రి 9 గంటల 9 నిమిషములకు ముగిస్తుంది.

ఇంకా చెప్పాలంటే అష్టమి( Durga Ashtami ) రోజున శుభ ముహూర్తం ఉదయం 6:15 నిమిషములకు మొదలై, ఏడు గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది.

అలాగే ఉదయం ఏడు గంటల 48 నిమిషాల నుంచి ఉదయం 9.20 నిమిషాల వరకు ఉంటుంది.

అంతే కాకుండా ఉదయం 10.53 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది.

ఈ రోజున దుర్గా మాతను పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి.అనుకున్న కార్యంలో విజయం కోసం బుధవారం పూట వచ్చే దుర్గాష్టమి రోజున అమ్మవారికి అభిషేక ఆరాధనలు చేయడం ఎంతో మంచిది.

"""/" / ఈ రోజున గులాబీ రంగు దుస్తులను ధరించడం మంచిది.అంతే కాకుండా వారికి తామర పువ్వులు సమర్పించడం ద్వారా సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి.సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి.

హల్వా, పూరీ, కొబ్బరి( Halwa )ని తీసుకోవచ్చు.నేతితో తయారుచేసిన వంటకాలను తీసుకోవచ్చు.

అమ్మవారికి నైవేద్యంగా నేతి ఫలహారాలు, తామర పువ్వుల మాలను సమర్పించవచ్చు.అంతే కాకుండా నాలుగు నుంచి 12 సంవత్సరాల లోపు గల బాలికలను ఇంటికి పిలిచి వారికి పాదపూజ చేసి తీలకాన్ని అందజేయాలి.

వారికి తీపి పదార్థాలను అందజేయడం ఎంతో మంచిది.అలాగే పేదలకు అన్నదానం చేయాలి.

పండ్లు, దుస్తులను దానంగా ఇవ్వాలి.దుర్గామాతకు సంబంధించిన మంత్రాలను పఠించాలి.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!