27న రామన్నపేట ఎంపీపీపై బలనిరూపణ..

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిపై( Jyothi ) ఎంపీటీసీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈ నెల 27 న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతితో సహా మొత్తం ఎంపీటీసీలకు చౌటుప్పల్ ఆర్డీఓ నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018( Telangana Panchayat Raj Act 2018 ) సెక్షన్ 263 లోని సబ్ సెక్షన్(1) నిబంధన ప్రకారం ఎంపీటీసీల తీర్మానం మేరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 27న ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.

ఎంపీటీసీలకు కూడా నోటీసులు అందడం వల్లనే ఎంపీపీ జ్యోతిపై బలపరీక్షకు రంగం సిద్ధం చేస్తున్నట్టు మండలంలో జోరుగా చర్చ సాగుతుంది.

మండలంలో 15 మంది ఎంపిటిసిలకు గాను కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు, సిపిఎం పార్టీకి ముగ్గురు, బీఆర్ఎస్ పార్టీకి ఐదుగురు సభ్యుల సంఖ్యా బలం ఉంది.

సిపిఎం,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పదిమంది ఎంపిటిసిలు ఎంపిపిపై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇటీవల ఆర్డీవోకు తీర్మానం కాపీని అందజేసిన విషయం అందరికీ తెలిసిందే.

డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!