రాత్రికి రాత్రే స్టార్ అయినా 110 ఏళ్ళ బామ్మా…!

సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న పెద్ద వయోభేదం లేకుండా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ వ్యాప్తంగా బీభత్సంగా పాపులర్ అవుతున్నారు.

యునైటెడ్ కింగ్డమ్ లోని వేల్స్ నగరానికి చెందిన ఎమీ హాకిన్స్ అనే 110 ఏళ్ల బామ్మ కూడా తనలోని టాలెంట్ ను బయటపెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

మొదటి ప్రపంచ యుద్ధం లో బాగా పాపులర్ అయిన ‘‘ఇట్స్‌ ఏ లాంగ్‌ వే టు టిప్పరరే’’ అనే ఓ విషాదకరమైన పాటను పాడిన ఆమె నెటిజన్లను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నారు.

అప్పట్లో లండన్ లోని ఐరిస్ వర్కర్ పాడిన ఈ పాట ఆర్మీ జవాన్ల మార్చింగ్ పాట అయ్యింది.

అయితే ఎమీ హాకిన్స్ ఈ పాత పాట పాడుతుండగా ఆమె ముని మనవడు సాచ్ ఫ్రీమాన్ ఓ వీడియో రికార్డ్ చేసి.

టిక్ టాక్ వేదికగా షేర్ చేశాడు.అయితే ఆమె వీడియో బ్రిటిష్ టిక్ టాక్ వేదికగా మిలియన్ల వీక్షణలను సాధించింది.

దీంతో ఈ భామ తన 110 ఏళ్ల వయసులో ఇంటర్నెట్ స్టార్ అయ్యింది.

110 సంవత్సరాల వయసులో కూడా పాటని గుర్తు పెట్టుకొని పాడగలుగుతున్న ఈ భామకు అందరూ ఫిదా అవుతున్నారు.

ఎమీ హాకిన్స్ 1911 లో కార్డిఫ్‌లో జన్మించింది కానీ న్యూపోర్ట్‌లోనే తన బాల్య జీవితం మొత్తం గడిపింది.

అయితే ఎమీ హాకిన్స్ జనవరి 24వ తేదీన తన 110వ పుట్టినరోజు సందర్భంగా ‘‘ఇట్స్‌ ఏ లాంగ్‌ వే టు టిప్పరరే’’ పాట ను ఆలపించింది.

దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో.అది సూపర్ హిట్ కావడంతో ఎమీ హాకిన్స్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తోంది.

ఆమె కుటుంబ సభ్యులు కూడా బర్త్ డే సందర్భంగా తమకు సోషల్ మీడియా నుంచి మంచి గిఫ్ట్ లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మూఢలు ఉన్నాయని టెన్షన్ పడుతున్నారా? అయితే ఇది మీకోసమే..!