ప్రధాని మోదీ నా కొడుకు అన్న 100 ఏళ్ల బామ్మ.. ప్రధానికి 25 ఎకరాలు రాసిస్తానంటూ?
TeluguStop.com
మన జీవితంలో రక్త సంబంధం లేని వాళ్లలో కొంతమందిని మాత్రమే ఎంతగానో అభిమానిస్తాం.
మనలో చాలామంది కొంతమంది సినీ నాయకులను, రాజకీయ నాయకులను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.
అయితే 100 సంవత్సరాల వయస్సు ఉన్న ముసలావిడకు మోదీ( PM Narendra Modi ) అంటే ఎంతో అభిమానం కాగా తాజాగా ఆ ముసలావిడ మోదీపై చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ప్రధాని మోదీ తల్లి కొంతకాలం క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే.అయితే ఆ తల్లి చనిపోయినా నేనున్నానంటూ ఆమె తెరపైకి వచ్చారు.
ఈ వృద్ధురాలి పేరు మంగీబాయి( Mangi Bai ) కాగా ఈమెకు 14 మంది పిల్లలు ఉన్నారు.
అయితే మోదీ తన 15వ కొడుకు అని ఆమె చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని మంగీబాయి అన్నారు.
తనలాంటి వాళ్లకు ప్రయోజనం చేకూరేలా మోదీ స్కీమ్స్ అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు.
"""/" /
తాను భవిష్యత్తులో సైతం మోదీకి మాత్రమే ఓటేస్తానని మంగీబాయి చెప్పుకొచ్చారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని( Madhya Pradesh ) హరిగరా గ్రామానికి చెందిన మంగీబాయి మోదీ తన కోసం కూడా చాలా చేశారని చెప్పారు.
తనలాంటి వృద్ధులకు మోదీ ఆహారం, వసతి కల్పిస్తున్నారని ఆమె అన్నారు.మోదీ నాకు ఇల్లు ఇచ్చారని ఫ్రీగా వైద్యం చేస్తున్నారని తెలిపారు.
పింఛన్ ఇస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. """/" /
మోదీ వల్లే నేను తీర్థయాత్రలకు వెళ్లగలిగానని మంగీబాయి పేర్కొన్నారు.
అందువల్లే మోదీ నా కొడుకు అని చెబుతున్నానని మంగీబాయి చెప్పుకొచ్చారు.తన పేరుపై ఉన్న 25 ఎకరాల భూమిని మోదీకి రాసిస్తానని ఆమె కామెంట్లు చేశారు.
మంగీబాయి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మంగీబాయి మంచి మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
మంగీబాయి చేసిన కామెంట్ల గురించి మోదీ రాబోయే రోజుల్లో రియాక్ట్ అవుతారేమో చూడాలి.
జానపద గీతానికి డ్యాన్స్ అదరగొట్టిన మిస్టర్ కూల్.. వీడియో వైరల్