ట్రైన్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన వృద్ధుడు వీడియో చూస్తే..
TeluguStop.com
భారతదేశంలో రైలు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది.ట్రైన్ ఎక్కేటప్పుడో, లేదంటే ట్రైన్ ఎక్కాక డోర్ దగ్గర నిల్చున్నవారో ప్రమాదాల్లో పడి ప్రాణాలు విడుస్తున్నారు.
కొందరైతే వెళ్తున్నా ట్రైన్ ని పట్టుకుని విన్యాసాలు చేస్తూ ఉంచి చివరికి మృత్యువాత పడుతున్నారు కొంతమంది శాశ్వతంగా దివ్యాంగులుగా మారుతున్నారు.
ఇలాంటి వీడియోలను షేర్ చేస్తూ ప్రజలను అధికారులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా ఇలాంటి వారిలో మార్పు కలగడం లేదు.
"""/" /
తాజాగా ఒక వృద్ధుడు రైలులో చాలా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా( Social Media)లో వైరల్ అయింది.
ఆయన రైలు కిటికీలోంచి బయటకు వేలాడుతూ, చాలా భయంకరమైన విన్యాసాలు చేస్తున్నాడు.ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తే ఏదో ఒక రోజున ప్రాణాలు పోయే అవకాశం ఉందని అందరూ అంటారు, కానీ కొంతమంది మాత్రం ఇలాంటి డేరింగ్, ఫీయర్లెస్ స్టంట్స్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు.
"""/" /
ఈ వృద్ధుడు ట్రైన్ లో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆయన తలపై ఒక తుండు లేదా టర్బన్ కట్టుకున్నాడు.చూసేందుకు బాగా బక్క చిక్కిపోయి ఉన్నాడు.
కానీ జాకీచాన్ బ్రూస్ లీ లాగా చాలా ధైర్యంతో ట్రైన్( Train) వెలుపలకు ముఖం పెట్టి ట్రైన్ వద్ద విన్యాసాలు చేశాడు.
ఇలా చేస్తున్నప్పుడు ఆయన తడబడి కింద పడిపోయే ప్రమాదం చాలా ఉంది.లేదా రైలులోని ఏదో ఒక భాగానికి తగిలి ఉండవచ్చు.
అయితే వీడియోలో అలాంటి ఏమీ జరగలేదు.వీడియోలో ఆయన రైలులో స్టంట్స్ చేస్తున్నదే చూపించారు.
చివరికి ఏమైందనేది తెలియ రాలేదు దీనిపై పోలీసులు ఇంకా అలాంటి చర్యలు తీసుకోలేదు.
ఆ వ్యక్తిని గుర్తిస్తే అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ : ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనా ?