వైరల్ వీడియో: వలలో చేప దొరికిందన్న ఆనందం కొద్దిసేపు కూడా లేకుండా..?
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ( Telugu States)అంతటా కూడా వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు.
ఒక్కసారిగా ఇలా వర్షాలు వచ్చాయి అంటే కొంతమంది చెరువుల వద్దకు వెళ్లి చేపలను వేట పట్టడం మొదలుపెట్టేస్తారు.
ఇలా చేపలు పట్టే వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
చేపల కోసం వల వేస్తే కొంతమందికి చిత్ర విచిత్ర జంతువులు బయటికి తీయడం మనం చూస్తూనే ఉంటాం.
కొన్ని కొన్ని సార్లు చేపల కోసం వలలు వేస్తే పాములు, తాబేలు, ముసల్లు లాంటివి దర్శనం ఇస్తాయి.
అచ్చం అలాగే తాజాగా ఒక వ్యక్తి కూడా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.
"""/" /
పెద్ద చేప వలలో పడిందని ఆనందపడేలోపు చేతిలోకి తీసుకోగానే ఏం జరిగిందో చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కొందరు నీటిలో వల వేసి చేపలు పడుతూ ఉంటారు.
ఇంతలో ఒక వ్యక్తి వల్ల గానే పెద్ద చేప పడిందంటూ వాళ్లను పైకి ఎత్తి చేపలు పరిశీలిస్తూ ఉంటాడు.
ఇంతలో మరో వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద చేప పడిందని సంతోషిస్తూ వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుంటాడు.
ఆలా ఆ చేపను ఒక్కసారిగా చేతిలోకి తీసుకోగానే ఆ వ్యక్తి షాక్ తగిలినట్లు షాక్ తో నీటిలోకి పడిపోతాడు.
చాలాసేపు గిలగిలా కొట్టుకోవడం కూడా మనం వీడియోలో చూడవచ్చు.ఈ క్రమంలో పక్కనే ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్లి వలను పక్కకు తీసేసి కింద పడిన వ్యక్తిని సురక్షితంగా రక్షిస్తాడు.
ఎట్టకేలకు ఆ వ్యక్తికి ఎటువంటి ప్రమాదం కలగలేదు.అలాగే ఆ చేపను చూసి ఆగ్రహం వ్యక్తం చేసి కోపంతో దాన్ని కాలితో తన్నడం మొదలుపెట్టాడు .
"""/" /
ఈ వీడియోను చూసిన కొంత మంది నెటిజన్స్.చూస్తుంటే ఆ చేప కరెంట్ షాక్ కొట్టే ఈల్ చేపలా ఉందని కామెంట్ చేయగా.
ఇక మరికొందరు అయితే ‘‘పెద్దాయనకు షాక్ ఇచ్చిన ఈల్ చేప’, ‘‘చావు అంచుల దాకా వెళ్లి రావడం అంటే ఇదేనేమో’’ అంటూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.
వదల బొమ్మాళీ వదల అంటూ పుట్టగానే కత్తెర పట్టుకున్న పసిబిడ్డ.. వైరల్ వీడియో!