లిథియం-అయాన్ సెల్‌ను ఆవిష్కరించిన ఓలా ఎలక్ట్రిక్... దీని విశేషాలివే..!

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా తొలి స్వదేశీ లిథియం-అయాన్ సెల్‌ను ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా దేశంలో మొట్టమొదటిగా తయారు చేసిన ఈ లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌ గురించి చాలా విశేషాలు పంచుకుంది.

దీని సహాయంతో చాలా తక్కువ స్థలంలోనే ఎక్కువ ఎనర్జీ అందించడం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

కొత్తగా తయారు చేసిన ఈ రకం బ్యాటరీ సెల్‌కి ఎన్ఎంసీ2170 అని నామకరణం చేసినట్టు వెల్లడించింది.

వచ్చే ఏడాది నుంచి తమ తమిళనాడు ఫ్యాక్టరీలో వీటిని భారీ సంఖ్యలో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది.

లిథియం-అయాన్ బ్యాటరీ సెల్‌ తక్కువ స్పేస్‌లో ఎక్కువ ఎనర్జీ అందించడంతో పాటు ఎక్కువ కాలం మన్నుతుందని కంపెనీ పేర్కొంది.

మన దేశ వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా ఈ లిథియం-అయాన్‌లోని సెల్‌ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్‌లో 40 శాతం బ్యాటరీలదే ఉండగా మిగతా భాగాలకు 60 శాతం మాత్రమే ఖర్చవుతుంది.

"""/"/ తయారీ ఖర్చులో ప్రధాన వాటా ఒక్క బ్యాటరీదే కాబట్టి వీటిలోని సెల్స్ స్థానికంగా తయారు చేసుకుంటే చాలా వరకు వాహనాల ఖర్చులను తగ్గించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ఈవీ కంపెనీలు బ్యాటరీలలో వాడే సెల్స్‌ను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాయి.అయితే మొదటిసారిగా భారతీయ కంపెనీ ఓలా ఈ సెల్‌ను అభివృద్ధి చేయడంతో ఇతర కంపెనీల దీనిపై కన్నేసాయి.

ఇదిలా ఉండగా ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ సెల్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా తాము స్థాపిస్తామని ఓలా కంపెనీ వెల్లడించింది.

నేను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచింది అతనే.. సమంత క్రేజీ కామెంట్స్ వైరల్!