నా ఆర్డర్‌ భయ్యా.. నువ్వు తినేస్తున్నావేంటి..? రెడ్ హ్యాండెడ్ గా దొరికిన డెలివరీ బాయ్..

ఈ మధ్యకాలంలో ఇంట్లో వంటకాలు చేయడానికి కష్టమైపోయి బయట రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకొని తినడం పరిపాటుగా మారిపోయింది.

చాలామంది ఇంట్లో కష్టపడి చేసి తినడం కంటే సులువుగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకొని తినడం సులువు అని భావిస్తున్నారు.

దీంతో అనేక రకాల ఫుడ్ డెలివరీ( Food Delivery ) సంస్థలు పుట్టుకు వచ్చాయి.

ఇకపోతే తాజాగా నోయిడా( Noida ) ప్రాంతానికి చెందిన ఓలా ఫుడ్స్( Ola Foods ) నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు.

ఒకవైపు ఆకలి వేస్తున్న ఆర్డర్ చేసిన భోజనం ఇంకా రాలేదని బాధపడుతున్నాడు.కానీ.

, అతని ఆకలి తీరలేదు సరి కదా కడుపు మండిపోయే చేదు అనుభవం అతనికి ఎదురైంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి గురిచేస్తుంది.ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెళితే.

"""/" / నోయిడా లో ఉంటున్న వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ నుండి ఆర్డర్ చేశాడు.

అయితే తన ఫుడ్ ను తీసుకవచే డెలివరీ ఏజెంట్( Delivery Agent ) ఫోన్ చేసి తనకి అదనంగా పది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దీంతో దానికి నిరాకరించిన జైస్వాల్ ఆ తర్వాత ఓకే అన్నాడు.అలా జరిగిన కానీ అతడు తాను ఆర్డర్ చేసిన ఫుడ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

అలా సుమారు 45 నిమిషాలు గడిచిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ డెలివరీ కాకపోవడంతో తన ఫుడ్డు ఎక్కడ వరకు వచ్చిందని చూడగా.

ఫుడ్ డెలివరీ కాలేకపోగా తన ఫుడ్ ను తీసుకువచ్చిన వ్యక్తి ఎంచక్కా తను ఆర్డర్ చేసిన ఫుడ్ ని లాగించేస్తున్న చేస్తున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.

ఆ డెలివరీ చేసే వ్యక్తిని ఇది నా ఫుడ్ నువ్వు తింటున్నావ్.ఏంటి.

? అని అడగగా." ఏం చేసుకుంటావో చేసుకో.

" అని అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మరింత కొపనానికి లోనయ్యాడు. """/" / నా ఫుడ్డు నువ్వు ఎందుకు తింటున్నావ్.

? అని ప్రశ్నించగా." మరి ఏం చేయాలంటూ" చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు సదరు డెలివరీ బాయ్.

మోటార్ సైకిల్ పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్ ను తినేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోని జైష్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇదివరకు కూడా మాకు ఇలాంటి కొన్ని సంఘటనలు ఎవరైనా చేస్తుండగా.ఇలాంటి వారిని కంపెనీ యాజమాన్యం వెంటనే తొలగించాలని కామెంట్ చేస్తున్నారు.

మరికొందరేమో ఈ ప్లాట్ఫారంలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదని కామెంట్ చేశారు.

కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలోనే బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో కంబ్యాక్ ఇచ్చారు.. ఎవరంటే..??