Okra : బెండ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే సాలీడు పురుగులను అరికట్టే పద్ధతులు..!

బెండ పంట( Lady Finger )ను ఆశించి తీవ్ర నష్టం కలిగించే సాలీడు పురుగులు టెట్రానిచస్ జాతికి చెందినవి.

ఈ జాతికి చెందిన ఆడపురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.కొన్ని పురుగులు ఎరుపు రంగులో కూడా ఉంటాయి.

వసంతకాలంలో ఆడపురుగులు గుండ్రని గుడ్లను ఆకు కింద పెడతాయి.పొడి వాతావరణం, వేడి వాతావరణం లో ఈ పురుగులు జీవిస్తాయి.

ఈ మొక్కలకు చాలా రకాల కలుపు మొక్కలు అతిథి మొక్కలు.సాలీడు పురుగులు బెండ మొక్కలను ఆశిస్తే.

ఆకుల పైభాగంపై తెలుపు నుండి పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి.ఆ తర్వాత ఆకులు తెలుసుగా మారి ఆకు ఈనెల మధ్య కత్తిరించబడినట్టు తెరుచుకుంటాయి.

ఇక చివరగా ఆకులు రాలిపోతాయి.బెండ మొక్క ఆకుల కింద సాలీడు పురుగుల గుడ్లను గుర్తించవచ్చు.

సకాలంలో ఈ పురుగులను అరికట్టడంలో విఫలం అయితే పంట నాణ్యత దెబ్బతింటుంది. """/"/ ఈ సాలీడు పురుగులను( Spider Mites ) గుర్తించడం కోసం పంట పొలంలో మొక్కల కింద అక్కడక్కడ ఆకుల కింద తెల్ల కాగితం ఉంచి ఆకులు ఊపాలి.

పొలంలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు పూర్తిగా తొలగిస్తూ ఉండాలి.నీటిని కాలువల వెంట మరియు ఇతర చెత్త పేరుకుపోయిన మార్గాల వెంట నీటిని తొలగించుకుంటూ నీటిని పార కట్టాలి.

ఈ పురుగులను సేంద్రీయ పద్ధతిలో అరికట్టాలంటే.తులసి, సోయాబీన్, వేప, రెప్సిడ్ లతో చేసిన ద్రావణాన్ని ఉపయోగించడం వల్ల ఈ పురుగులను చాలా వరకు అరికట్టవచ్చు.

పురుగుమందు సబ్బు, దురదగొండి ముద్ద, వెల్లుల్లి టీ మిశ్రమాలను ఉపయోగించి ఈ పురుగుల జనాభాను చాలా వరకు నియంత్రించవచ్చు.

"""/"/ రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే.ఒక మిల్లీ లీటరు స్పిరో మెసిఫిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

లేదంటే ఐదు మిల్లీలీటర్ల డైకోఫోల్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే రెండు రోజులకు ఒకసారి లాగా రెండుసార్లు మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

బన్నీ బొమ్మను కాలితో గీసి అభిమానం చాటుకున్న దివ్యాంగ అభిమాని.. ఏమైందంటే?