తెలంగాణలో ఆయిల్ రిఫైనరీ..!

తెలంగాణలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకానుంది.దీని ఏర్పాటు కోసం జెమిని ఎడిబుల్స్ సంస్థ రూ.

400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.సింగపూర్ కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్ నేషనల్, ఫ్రీడం ఆయిల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో పెట్టుబడులు పెట్టనున్నారు.

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి హైదరాబాద్ సమీపంలో ఈ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో జెమిని ఎడిబుల్స్ సంస్థ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్.ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని వెల్లడించారు.

జెమిని ఎడిబుల్స్ సంస్థ పెట్టుబడి రాష్ట్రంలో వంట నూనెల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రదీప్ తెలిపారు.

ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఆయిల్ రిఫైనరీ ద్వారా వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి కలగడంతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదేందయ్యా ఇది.. తీసేకొద్దీ బంగారం, డబ్బులు (వీడియో)