25 ఏళ్లుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులకు దిగ్బ్రాంతి కలిగించే విషయం తెలిసింది!

25 ఏళ్లుగా తమ రక్తంగా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులకు ఆ బిడ్డ తమది కాదంటూ దిగ్బ్రాంతి కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది.

అమెరికా లోని ఓహియో కి చెందిన ఒక జంట పిల్లలు లేరని 1994 లో సిన్సినాటి లోని మూడు ఆరోగ్య సంస్థలను సంప్రదించి సంతానోత్పత్తి చికిత్స తీసుకున్నారు.

వారికి పిల్లలు కలగడం కష్టం అని తేల్చిన వైద్యులు సరోగసి(అద్దె గర్భం) ద్వారా సంతానోత్పత్తి కి సూచించి,అనుకున్నట్లుగానే వారికి ఒక ఆడశిశువు పుట్టినట్లు వైద్యులు తెలిపారు.

దీనితో అప్పటి నుంచి కూడా ఆ బిడ్డ తన భర్త జోసెఫ్ రక్తమే అని భావించి ఇన్నాళ్లు ఆ ఇద్దరు దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

అయితే 25 ఏళ్ల తరువాత వారికి ఒక దిగ్బ్రాంతి కలిగించే విషయం తెలిసింది.

జోసెఫ్ ఆయన భార్య - పెంచుకున్న కూతురుకు డీఎన్ ఏ పరీక్షలు జరపగా దానిలో వారికి ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది.

25 ఏళ్లుగా పెంచుకుంటున్న కూతురు డీఎన్ ఏ తండ్రితో కలవలేదు.దీంతో తమ కూతురు కాదని తెలిసి ఆ దంపతులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అంతేకాకుండా అమ్మాయి డీఎన్ ఏలో ఐదుగురు తండ్రుల డీఎన్ఏ ఉన్నట్లు తెలియడం తో వారు మరింత ఆశ్చర్యానికి లోనయ్యారట.

"""/"/ సరోగసి ద్వారా తన రక్తమే అని భావించిన జోసెఫ్ కు ఈ విషయం తెలియడం తో ఒక్కసారిగా ఖిన్నుడై నిలిచిపోయాడు.

అయితే ఇలా తన బిడ్డే అంటూ మోసం చేసిన ఆ సంతానోత్పత్తి కేంద్రాలపై కోర్టు లో జోసఫ్ కేసు కూడా ఫైల్ చేసినట్లు తెలుస్తుంది.

నిజంగా ఇన్ని సంవత్సరాలుగా తమ రక్తంగా భావించిన కూతురు తమ రక్తం కాదని తేలడం తో వారు బాధ తో కుమిలిపోతున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. జోక్యం చేసుకోండి , బైడెన్ ప్రభుత్వాన్ని కోరిన భారత సంతతి నేతలు