Ohio Subway : ఓరి నాయనో.. ఒక్క శాండ్‌విచ్‌కు ఏకంగా రూ.82,000 వసూలు చేశారు..!

ఇటీవల కాలంలో కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఆటోమేటిక్ ఔట్‌లెట్స్ మామూలు ఆహారాలకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి.

తాజాగా యూఎస్‌లో ఒక సబ్‌వే శాండ్‌విచ్‌( Subway Sandwich )ను కొన్నందుకు కస్టమర్‌కు ఏకంగా 1000 డాలర్లు (సుమారు రూ.

82,000) బిల్లు వేశారు.ఈ ధరతో మోస్ట్ పవర్‌ఫుల్ మొబైల్ అయిన ఐఫోన్ 15 ప్రో కూడా కొనుగోలు చేయవచ్చు.

వివరాల్లోకి వెళితే, లెటిటియా బిషప్ అనే మహిళ తన కుటుంబం కోసం ఓహియోలోని సబ్‌వే( Ohio Subway ) నుంచి మూడు శాండ్‌విచ్‌లను కొనుగోలు చేసింది.

శాండ్‌విచ్‌లకు డబ్బు చెల్లించడానికి డెబిట్ కార్డ్‌ను ఉపయోగించింది.అయితే కార్డు స్క్రాచ్ చేసిన తర్వాత 1,021 (సుమారు రూ.

84,632) డాలర్లు ఆమె అకౌంట్ నుంచి కట్ అయ్యాయి.అది చూసి ఆమె షాక్ అయ్యింది.

ఒక్క శాండ్‌విచ్ కే 1,010 డాలర్లు (దాదాపు రూ.83,720) తన బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యాయని ఆమె గ్రహించింది.

ఈ శాండ్‌విచ్ వల్ల ఆమె బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయింది, మిగతా ఫుడ్ కోసం ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి అప్పుగా డిటెక్ట్ అయ్యాయి.

సాధారణంగా సబ్‌వేలో శాండ్‌విచ్ ధర 6.50 నుంచి 12 డాలర్ల (రూ.

538 నుంచి రూ.994)( Subway Sandwich Cost ) మధ్య ఉంటుంది.

"""/"/ భారీ ఛార్జ్ కారణంగా తన బ్యాంక్ అకౌంట్ నెగటివ్ గా మారిందని లెటిషియా బిషప్ చెప్పారు.

ఆమె సిబ్బందితో మాట్లాడటానికి సబ్‌వేకి తిరిగి వెళ్ళింది, అయితే వారు ఆమెను సబ్‌వే ప్రధాన కార్యాలయానికి కాల్ చేయమని చెప్పారు.

కానీ అసలు వ్యక్తితో మాట్లాడేందుకు ఫోన్ నంబర్ లేదని చెప్పింది.సబ్‌వే తనను మోసం చేసి దాదాపు రెండు నెలలుగా తనకు సహాయం చేసే వారెవరూ దొరకలేదని కూడా చెప్పింది.

"""/"/ లెటిషియా బిషప్ తన బ్యాంకుకు సమస్య గురించి చెప్పడానికి ప్రయత్నించింది కానీ వారు కూడా ఆమెకు సహాయం చేయలేదు.

బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పింది.ఆమె ఫుడ్ కొనుగోలు చేసిన సబ్‌వే యూఎస్‌లోని 20,500 ఔట్‌లెట్స్‌లో ఒకటి.

ఇది థోర్న్‌టన్స్ అనే గ్యాస్ స్టేషన్ లోపల ఉంది.అయితే దీని గురించి తెలిసిన చాలామంది ఇలాంటి చోట్ల కార్డులను ఉపయోగిస్తే ఎక్కువ డబ్బులు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాజమౌళి వల్ల కానిది ప్రశాంత్ నీల్ చేసి చూపిస్తాడా..?