సొంత చెల్లిని రేప్ చేయించి చంపాలని చూసిన హీరోయిన్.. దానికోసం ఎంత కుట్ర?
TeluguStop.com
ఒక మనిషి మరో మనిషిని చంపాలంటే అసలు ఎలా ధైర్యం వస్తుందో తెలియదు కానీ.
ఇప్పటికీ భూమిపై అలా ఎన్నో నేరాలు జరిగాయి.అయినా గాని చంపడాలు, చంపించడాలు మాత్రం ఆగనేలేదు.
మరి అలా చంపడానికి వెనుక కారణం ఏదో ఉండదు.కేవలం డబ్బు కోసం అలా చేస్తుంటారు కొందరు దుండగులు.
ఇక మంచి హోదాలో ఉన్న ఓ హీరోయిన్ ఏకంగా తన సొంత చెల్లినే రేప్ చేయించి చంపాలని చూసిందట.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాక్షి శివానంద్.
యమజాతకుడు సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత కలెక్టర్ గారు, మాస్టర్, సీతారామరాజు, రాజహంస, యువరాజు వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది.
ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడో గుడ్ బాయ్ చెప్పగా ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీలో బాగా బిజీగా ఉంది.
ఇక ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది.ఆమె ఎవరో కాదు మంచు విష్ణు నటించిన విష్ణు సినిమాలో హీరోయిన్ గా నటించిన నటినే శిల్పా ఆనంద్.
ఇక ఈమె ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.
దాంతో ఇండస్ట్రీకి దూరమవ్వగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇదిలా ఉంటే గతంలో తన అక్క సాక్షి శివానంద్, తన అక్క అత్త భావన తనను, తన తల్లిని చంపాలని చూస్తున్నారంటూ తెలిపింది.
ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ స్టోరీ లో షేర్ చేయగా.అందులో తన అక్క సాక్షిశివానంద్ అత్త తనను, తన తల్లిని చంపాలని చూస్తుందని.
ఆమెకు తన అక్క సహకరిస్తుందని తెలిపింది.గతంలో తన అక్క వాళ్ళ అత్త భావన పై తన తల్లి హత్య కేసు పెట్టిందట.
కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భావన తన భర్తను చంపేసింది అని ఆ విషయాన్ని తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపింది.
దాంతో తనను, తన తల్లిని చంపడానికి ప్రయత్నించిందని తెలిపింది.కానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆమె అమెరికాకు పారిపోయిందట.
ఇక ఆమెను ఇండియా పోలీసులకు ఎదురుపడమని పబ్లిక్ గా అడుగుతున్నాను అంటూ తెలిపింది.
"""/"/
ఇక తన తల్లిని కూడా ఇక్కడ పోలీసులు చాలాసార్లు పిలిచారని.కానీ భావన అమెరికాకు పారిపోవడంతో ఆమె వచ్చేవరకు వేచి చూద్దామని అన్నారట.
దీంతో ఆమె కూడా ఏం జరుగుతుందో చూద్దాం అంటూ.కచ్చితంగా ఈ విషయం గురించి ఏం జరిగిందో చెబుతాను అంటూ అందరి సపోర్ట్ కావాలి అని తెలిపింది.
ఇక తన అక్క సాక్షి శివానంద్, తన బెస్ట్ ఫ్రెండ్ పై కూడా కొన్ని ఆరోపణలు చేసింది.
మీపై రేప్ చేయించడానికి మీ బెస్ట్ ఫ్రెండే ఒకర్ని పూర్మాయిస్తే మీకు తెలిసిపోతుంది అంటూ.
ఆ సమయంలోనే మీ మూడో కన్ను తెరిచి ఉంటుంది.అలాగే మీ సోదరి మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని గెంటి వేస్తే దాని వెనుక ఉన్న కారణం కూడా మీకు తెలిసి పోతుంది అంటూ.
మీ సోదరి అత్తమ్మ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన, మీ ఆస్తులను దక్కించుకోవాలని చూసిన వెంటనే మీరు పసిగట్టవచ్చు అంటూ పోస్ట్ చేయగా.
ఈమె చేసిన ఈ పోస్టుకు తన అక్క సాక్షి శివానంద్ తనను చంపడానికి చూస్తుందని పరోక్షంగా తెలిపింది.
ఇక ఈ విషయం గతంలో తన సోషల్ మీడియా వేదికగా తెలపగా ప్రస్తుతం మళ్లీ ఈ విషయం వైరల్ గా మారింది.
వైరల్ వీడియో: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో విందు ఏర్పాటు