ఓరి దేవుడా.. ఆమె నాలిక ఏంటి అంత పొడవుగా ఉంది!

ప్రపంచంలో అనేక రకాల విభిన్నమైన రికార్డులు నమోదవుతుంటాయి.గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book Of World Records) ప్రతి సంవత్సరం అద్భుతమైన, ఆసక్తికరమైన రికార్డులను గుర్తిస్తూ వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

కొంతమంది అత్యంత పొడవైన గోళ్లను పెంచడం, మరికొందరు అత్యంత ఎక్కువ సమయం నీటిలో ఊపిరి బిగపట్టడం, ఇంకొందరు అసాధారణ శరీర లక్షణాలతో రికార్డులు సాధించడం చేస్తారు.

అయితే, ఒక మహిళ ఏమి చేయకున్నా తన నాలుక(tongue) పొడవుతో గిన్నిస్ రికార్డు సృష్టించడం జరిగింది.

క్యాలిఫోర్నియాకు(California) చెందిన చానెల్ టాపర్(Chanel Topper) అనే యువతి తన నాలుక పొడవు 9.

75 సెంటీమీటర్లు (3.8 అంగుళాలు) ఉండటంతో ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,.ఆమె తన నాలుక ఇంత పొడవుగా ఉందని ఇప్పటి వరకు కూడా గమనించలేదు.

టాపర్ తన తల్లితో కలిసి హాలోవీన్ ఫోటో సెషన్ చేస్తున్నప్పుడు తొలిసారి తన నాలుక గురించి తెలుసుకుంది.

ఆ ఫోటోలో తన నాలుక అసాధారణంగా పొడవుగా కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది.అప్పటి నుంచి ఈ విషయాన్ని పరిశీలించడం ప్రారంభించింది.

"""/" / టాపర్ తన నాలుకను(tongue) ఫోటోలు, వీడియోల ద్వారా షేర్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్(Instagram, TikTok) వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆమె వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఇది మరింత సంచలనం అయింది.

ప్రజలు ఈ వీడియోను చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.ఇంతకు ముందు, అత్యంత పొడవైన నాలుక (పురుషులు) అనే గిన్నిస్ రికార్డు అమెరికాకు చెందిన నిక్ స్టోబెర్ల్ పేరిట ఉంది.

అతని నాలుక పొడవు 10.1 సెం.

మీ (3.97 అంగుళాలు).

ఇప్పుడు, మహిళల విభాగంలో టాపర్ ఈ అరుదైన రికార్డును సాధించింది. """/" / ఈ రికార్డు గురించి తెలుసుకున్న తర్వాత చాలా మంది టాపర్‌ను ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.

మీ నాలుక అంతపొడవు ఎలా పెరిగిందంటూ సరదాగా ప్రశ్నిస్తుంటే, మరికొందరు "ఇంత పొడవైన నాలుకతో తినడానికి సులువుగానే ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

కానీ, టాపర్ మాత్రం తన నాలుకను ఓ ప్రత్యేకమైన వరంగా భావిస్తూ దాన్ని ఆస్వాదిస్తున్నానని చెబుతోంది.