తాత జ్ఞాపకార్థం, తల్లి పుట్టిన రోజు సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించిన ఓగ్గు శ్రీనిధి

రాజన్న సిరీసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి ప్రతి రోజు పని రీత్యా వచ్చి పోయే ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీర్తి శేషులు ఓగ్గు కథ కళాకారులు ఓగ్గు మల్లయ్య యాదవ్ జ్ఞాపకార్థం ఆయన మనుమరాలు ఓగ్గు శ్రీనిధి చలివేంద్రాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.

ఒగ్గు శ్రీనిధి పొదుపు చేసుకున్న తన డబ్బుల నుంచి కొంత డబ్బును చలివేంద్రం ఏర్పాటు కు వినియోగించే రంజన్లకు ఖర్చు చేసి తన తల్లి ఎల్లారెడ్డిపేట మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదినం సందర్భంగా సోమవారం తహాసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.

తన పొదుపు డబ్బులు నుండి కొంత డబ్బును వినియోగించి తన తాత కీర్తిశేషులు ఒగ్గు మల్లయ్య యాదవ్ తన తల్లి ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదినం సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచిన చిట్టి తల్లి శ్రీనిధి ని తాహాసిల్దార్ రామచంద్రం అభినందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి దూస శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,మల్లేశం యాదవ్ రమేష్ యాదవ్ , తదితరులు పాల్గొని శ్రీ నిధి ని అభినందించారు.

రోజా అవినీతి 3000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.. కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు వైరల్!