కాంగ్రెస్ పార్టీ లో చేరిన తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి కెటిఆర్ వెన్నంటి ఉండి రెండు పర్యాయాలు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా మరో మారు వార్డు మెంబర్ గా ఎన్నికై ఉపసర్పంచ్ గా పనిచేసిన ఎల్లారెడ్డిపేట తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఎల్లారెడ్డిపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజేందర్ రావు చెల్లెలు శిరీష చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

మహిళల పట్ల చూపుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి పేట తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే ఈమె భర్త స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందుగానే సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

పన్నూన్‌ హత్యకు కుట్ర కేసు : అనుమానితుడు నిఖిల్ గుప్తాని అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్