సింగసముద్రంను పరిశీలించిన కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డి పేట,కోరుట్ల పేట, బొప్పాపూర్ ,సర్వాయి పల్లి గ్రామాలకు సాగు నీటిని అందించే సింగ సముద్రం లోకి గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ( Heavy Rains)సోమవారం వరకు 20 ఫీట్లు మేర నీరు వచ్చి చేరగా సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, సింగ సముద్రం మైసమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు నే వూరి శ్రీనివాస్ రెడ్డి లు సింగసముద్రం ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

సింగ సముద్రం పూర్తి నీటి సామర్థ్యం 27 ఫీట్లు కాగ మరో ఏడు ఫీట్ల మేర నీరు వచ్చి చేరితే మత్తడి దూకే అవకాశం ఉంది.

మత్తడి దూకితే పై గ్రామాలకు సాగు నీరు అంది పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉంది.

సముద్రం పూర్తి స్థాయిలో నిండితే రైతుల కండ్లల్లో సంతోషం కనబడనుంది.

డైరెక్షన్ కి కొత్త అర్థాన్ని చెబుతున్న దర్శకుడు సంతోష్ జగర్లపూడి… సినిమా కోసం ఏదైనా చేసేస్తాడా..?