కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన ‘ఓజి’ మేకర్స్.. హంగ్రీ చీతా ఎంట్రీతో రికార్డులు బద్దలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఒకవైపు జనసేన పార్టీ పనులతో బిజీగా ఉంటూనే మరో వైపు క్రేజీ లైనప్ లో ఉన్న తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Director Sujeeth )దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ''ఓజి''.

ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలునెలకొన్నాయి.ఇక పవన్ అన్నిటి కంటే ఇది ముందు పూర్తి చేయడానికి ఆసక్తి చూపడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు.

అలాగే ఇది ఒరిజినల్ స్టోరీ కావడం కూడా ఓజి సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న పుట్టిన రోజు జరుపుకోనున్నారు.ఈ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండి అప్డేట్ కోసం మేకర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఓజి మేకర్స్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు.

"""/" / రేపు ఉదయం 10.35 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ విషయాన్నీ ఇప్పటికే పోస్టర్ ద్వారా తెలిపారు.ఇలా వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు.

ఈ రోజు మరో పోస్టర్ రిలీజ్ చేసారు.మరొక 24 గంటల్లో హంగ్రీ చీతా ఎంట్రీ అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది.

"""/" / టీజర్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…