ప్రజావాణి పిర్యాదు పై స్పందించిన అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట లో, శ్రీ లక్ష్మీ కేశవ పెరుమండ్ల గుట్ట, బస్ స్టాండ్ వద్ద గల గిద్దే చెరువు వద్ద గల స్మశాన వాటికలకు విద్యుత్ సరఫరా లేక ఎవరైనా చనిపోతే ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించారు.

వినతి పత్రం స్వీకరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి మూడు స్మశాన వాటికలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం అంచనాలు తయారు చేయాలని సెస్ ఎం డి,సెస్ ఏఈ పృథ్వీ ధర్ ను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం సెస్ లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ రాజం మూడు స్మశాన వాటికలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి మొత్తం 45 వరకు విద్యుత్ స్తంభాలు అవసరమని అంచనాలు తయారు చేసి సెస్ కార్యాలయానికి పంపించినట్లు సెస్ ఏ ఈ పృథ్వీ ధర్,లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ రాజం తెలిపారు.

స్థానిక కాంగ్రెస్ నాయకుల,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్లి విద్యుత్ స్థంభాల ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం కృషి చేస్తానని ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.

సెస్ అధికారుల వెంట ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.

ఈ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…