అధికారులు గ్రామాలలో పారిశుద్ధంపై చర్యలు తీసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు నెల రోజుల నుండి నిరవధిక సమ్మె బాట పట్టడంతో గ్రామాలలో చెత్త పేరుకుపోయింది.

వర్షాకాలం కావడంతో పేరుకు పోయిన చెత్త దుర్వాసనతో దోమల వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని ప్రజలు రోగాల బారిన పడతామని భయాందోళనచెందుతున్నారు.

ప్రభుత్వం సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న, గ్రామాలలో పారిశుద్ధంపై చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనబడడం లేదు.

మండలంలోని పలు గ్రామాలలో, మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో, పలు వార్డులలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి.

చెత్త కుప్పలలో పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చాలా ఏళ్ల గ్యాప్ తీసుకుని తిరిగి కలిసి నటించిన హీరో హీరోయిన్స్ వీరే !