అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట జిల్లా: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెజస్ నందలాల్ పవార్ శనివారం వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో వర్షపాతం ఉన్నందువల్ల ప్రతి అధికారి తమ విధులు నిర్వహించే కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని,గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పురాతన ఇళ్లను గుర్తించి ఇల్లలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వర్షాల కారణంగా కాజ్వేలపై, రోడ్లపై ప్రవాహాలు ప్రవహిస్తున్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.మున్సిపల్,గ్రామపంచాయతీ,రెవెన్యూ,పోలీసు అధికారులు ప్రవాహాలు జరిగేచోట సిబ్బందిని పెట్టాలన్నారు.

అలాగే ప్రజలు గుర్తించేలా ఎర్రజెండాలు,డేంజర్ బోర్డులు,ఫ్లెక్సీలను,వాగులు,కల్వర్టుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను పెట్టాలని సూచించారు.

చేపల వేటకు వెళ్ళరాదని, అత్యవసర పరిస్థితులలో అందుబాటులో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని మత్యశాఖ ఏడిని, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు పాత పాఠశాలలు,శిధిలమైన భవనాలు గుర్తించి తాళం వేయాలని డీఈవో అశోక్ ను,రోడ్లకు ఇరువైపుల ఉన్న చెట్లు వర్షాల వల్ల పడిపోయినట్ల అయితే వెంటనే తొలగించాలని ఆర్ అండ్ బి అధికారులను,గ్రామాల్లో వేలాడుతున్న కరెంట్ వైర్లను సరి చేసి,విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కమిషనర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పరిశుద్ద్య పనులను నిరంతరం పరివేక్షిస్తూ పట్టణాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

అధికారులు ఎప్పుడు గ్రామంలో అందుబాటులో ఉండాలని కమిషనర్లను పంచాయతీ సెక్రెటరీలను ఆదేశించారు.ఏఎన్ఎం స్ధాయి నుండి మెడికల్ ఆఫీసర్ వరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలేక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 6281492368 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ సినీ సెలబ్రిటీస్ అందరూ రాజుల కుటుంబానికి చెందినవారు !