దళితుల జీవితాలలో చెలగాటం ఆడుతున్న అధికారులు..
TeluguStop.com
బీఎస్పీ మండల అధ్యక్షులు కుమ్మరి దేవదాసు రాజన్న సిరిసిల్ల జిల్లా :పోరాడి తెచ్చుకున్న తెలంగాణా( Telangana ) లో దళితులకు ఆత్మహత్య లే దిక్కు అవుతున్నాయని నిత్యం దళిత జపం చేసే ప్రభుత్వాలకు ఇధి సిగ్గు చేటు అని బీఎస్పీ కోనరావుపేట మండల అధ్యక్షులు కుమ్మరి దేవదాసు అన్నారు.
ఈ సందర్భంగా దేవదాస్ మాట్లాడుతూ గతంలో గత్యంతరం లేక వెట్టి చాకిరి విముక్తి కోసం తుపాకులు పట్టి పోరాడిన అన్నలను నాటి ప్రభుత్వము మీకు బ్రతుకు దెరువు చూపిస్తాం మిరు లోంగి పొండి జనజీవన స్రవంతిలోకి కలవండని చెప్పి జనజీవన స్రవంతిలోకి కలిసిన అన్నలకు (నక్సలైట్లకి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం భూమి పట్టాలు( Land ) పంపిణీ చేసిన .
నేడు తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం అవే భూములను మళ్ళీ లాక్కుంటున్న పరిస్థితి దాపరించిందని విమర్శించారు.
దిని వల్ల అమాయక దళితులు ఆత్మహత్యల కు పాల్పడుతున్నారు అని అన్నారు.దీనికి ఉదాహరణ సోమవారం కొండాపూర్( Kondapur ) గ్రామ వాసి దళిత రైతు బిడ్డ మల్యాల నందం తను కు ఇచ్చిన 116 ఏ సర్వే నెంబర్ లో ఎకరం నర భూమి నాడు ఇచ్చి .
ఇవ్వాళ మళ్ళీ లాక్కోవటం వలన.వారికి ఉన్న జీవన ఆధారం పోతుంది.
అధికారుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కి పాల్పడటం చాలా బాధాకరం అని అన్నారు.
ఇప్పటికి అయిన అధికారం యంత్రాంగం వెంటనే స్పందించి నందం సాగు చేసుకుంటున్న భూమిని ఆయనకు ఇవ్వాలని అలాగే ఈ ప్రక్రియలో 50,000 లంచం అడిగిన సర్వేయర్లు మిగతా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో మండలం ముట్టడికి పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పులి సునీల్, కుమ్మరి విజయ్,బుట్టి ఇమ్మానియేల్, కిషోర్,అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
ఖర్జూరం తినేటప్పుడు మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నారా..?