అధికారుల నిర్లక్ష్యం: మగాడికి వితంతు పింఛన్..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో భర్తను కోల్పోయిన మహిళలు ఒంటరిగా ఉన్న వారికి వితంతు పింఛన్ అందించడం మనం చూస్తూనే ఉన్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ పెన్షన్ కానుక పథకం అమల్లో భాగంగా అర్హులైన వారికి అధికారులు ప్రతినెల పెన్షన్లు అందిస్తున్న సంగతి విధితమే.

అయితే వితంతు పింఛన్ అంటే భర్త చనిపోయి ఒంటరైనా మహిళలకు మాత్రమే ఈ పెన్షన్ వర్తిస్తుంది.

ఇదిలా ఉండగా చాలా చోట్ల అనర్హులకు ఈ పెన్షన్ అందుతున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

అయితే తాజాగా ఓ విషయం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

వితంతు పింఛన్ అంటే ఎక్కడైనా సరే కేవలం ఆడవారికి మాత్రమే పొందే పథకం.

అయితే ఓ గ్రామంలో మాత్రం మగాడికి వితంతు పెన్షన్ మంజూరు అయ్యింది.అంతేకాకుండా కొన్ని సంవత్సరాల పాటు అతను పింఛన్ డబ్బులు తీసుకుంటూనే ఉన్నాడు.

సంవత్సరాలు గడిచిపోతున్న ఈ విషయాన్ని అధికారులు గమనించకపోవడం ఇంకా విడ్డూరంగా అనిపిస్తుంది.ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దు పెంట గ్రామానికి చెందిన కాసిమ్ అనే వ్యక్తికి జరిగింది.

అతనికి 2009 సంవత్సరంలో పెన్షన్ మంజూరు అయింది.దాంతో అతడు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూనే ఉన్నాడు.

అయితే అతడు ఉపాధి పనుల నిమిత్తం కొంత కాలం అతడు గుంటూరు జిల్లాకు వలస వెళ్లగా గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం లోని చిత్తాపురం వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి పింఛన్ కోసం అతడు వెళ్ళాడు.

అయితే ఒక మగ వ్యక్తి వితంతు పెన్షన్ అందలేదని రావడంతో అక్కడ ఉన్న అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయింది.

ఒక మగాడికి వితంతు పింఛన్ రావడం ఏంటి అంటూ ఆరా మొదలుపెట్టాడు.మొదటగా ఆ వ్యక్తికి పూర్తి వివరాలు అడుగగా అతడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు.

దాంతో గుంటూరు జిల్లా అధికారులు వెంటనే కర్నూలు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

దాంతో పింఛన్ ఎవరు మంజూరు చేశారు.? ఎన్ని సంవత్సరాల పాటు నిర్లక్ష్యంగా పింఛన్ ఎలా ఇస్తున్నారో లాంటి శాఖాపరమైన చర్యలకు విచారణ చేపడుతున్నారు.

ఈ విషయాన్ని డీఆర్డీఏ అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.ఏది ఏమైనా ఒక మగ వ్యక్తి వితంతు పెన్షన్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది.

చూడాలి మరి చివరకు ఎన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇందులో.

మహేష్ బాబు రాజమౌళి సినిమా కంటే ముందే మరో సినిమా చేయనున్నాడా..?