మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై అధికారుల దర్యాప్తు ముమ్మరం
TeluguStop.com
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
బ్యారేజ్ 20వ పియర్ వద్ద భూమిలోకి కుంగింది.డ్యామ్ కు, క్రస్ట్ గేట్ కు మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి.
అదేవిధంగా 7వ బ్లాకులోని 18, 19, 20, 21 పియర్స్ దగ్గర వంతెన కుంగిపోయింది.
సాంకేతిక నష్టాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ అంచనా వేస్తుంది.ఈ క్రమంలోనే సమగ్ర అధ్యయనానికి ఈఎన్సీ మురళీధర్ తో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
భారీ శబ్ధంతో వంతెన కుంగిన ప్రాంతాన్ని ఇప్పటికే అధికారులు పరిశీలించారని చీఫ్ ఇంజనీర్ తెలిపారు.
డ్యామ్ పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వస్తుందని వెల్లడించారు.
స్టార్ హీరోయిన్ శ్రీలీలకు మూవీ ఆఫర్లు తగ్గడానికి అసలు కారణాలివేనా?